
ఇంత అభద్రతా భావమా ? అంటూ నిలదీశారు కేటీఆర్.
వార్డు మెంబర్ కూడా కాని రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డికి కలెక్టర్ సలాం కొట్టొచ్చు, పోలీసులు ఎస్కార్ట్ ఇవ్వవచ్చు.. తిరుపతి రెడ్డి కళ్యాణలక్ష్మి చెక్కులు పంచవచ్చు... అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేయొచ్చు.. ఏ అర్హత లేకున్నా అధికారిక వేదికపై కలెక్టర్ ను వెనక్కు నెట్టి వేదికను పంచుకోవచ్చు.. మంత్రి పొంగులేటి పుట్టినరోజు విద్యార్థులను ఎండలో నిలబెట్టి శుభాకాంక్షలు తెలియజేయవచ్చు.. ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క సతీమణికి ఎస్కార్ట్ సదుపాయం కల్పించవచ్చు.. కానీ, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, రాష్ట్రాన్ని సాధించి, తెలంగాణ ఆత్మగౌరవాన్ని నిలబెట్టి, అస్థిత్వాన్ని చాటిన కేసీఆర్ పుట్టినరోజున విద్యార్థులకు మిఠాయిలు పంచితే తప్పా ? అని కేటీఆర్ ప్రశ్నించారు.
రేవంత్ రెడ్డికి ఐఏఎస్, ఐపీఎస్ లంటే గౌరవం లేదు.. సహచర మంత్రుల మీద నమ్మకం లేదు అంటూ సోషల్ మీడియాలో ఘాటుగా పోస్టు పెట్టారు కేటీఆర్.