ఒకే హత్య కేసులో.. 17 మందికి జీవిత ఖైదు పడిన ఘటన నల్గొండ జిల్లాలో జరిగింది. నల్గొండ జిల్లా జరిగిన ఓ హత్య కేసులో 17 మంది నిందితులకు జీవిత ఖైదు విధిస్తూ నల్గొండ జిల్లా ఎస్సీ, ఎస్టీ కోర్టు తీర్పు ఇచ్చింది.

అడ్డగూడూరు మండలం ఆజిమ్ పేటకి చెందిన బట్ట లింగయ్యను దుండగులు హత్య చేశారు. ఈ హత్య కేసులో అప్పటి సర్పంచ్ తో సహా 18 మంది నిందితుల పేర్లను ఎఫ్ఐఆర్ లో పోలీసులు నమోదు చేశారు. కోర్టు వాయిదాలు నడుస్తున్న సమయంలో ఓ నిందితుడు మృతి చెందాడు.

అందువల్ల తుది తీర్పులో భాగంగా 17 మందిని దోషులుగా తేలుస్తూ కోర్టు తీర్పు చెప్పింది. 17 మందికి జీవిత ఖైదు శిక్షను ఎస్సీ, ఎస్టీ కోర్టు అదనపు న్యాయమూర్తి రోజా రమణి  అమలు చేశారు. తీర్పు వెల్లడైన తర్వాత దోషుల కళ్లలో కన్నీళ్లు రాగా.. కోర్టు తీర్పుపై బాధిత కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: