
హైదరాబాద్ బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో... బీఆర్ ఎస్ ప్రభుత్వంలో జరిగిన అక్రమాలను ప్లకార్డులతో నిరసన తెలిపారు. తొలగించబడిన 26 కులాలను బీసీలలో కలుపుతామని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ హామీని ఇచ్చారన్నారు. తాము కూడా గత ప్రభుత్వ నిర్ణయంపై సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసినట్లు వివరించారు.
తొలగించిన 26 కులాలను ఓసిలో చేర్చడం వల్ల... రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన కుల గణనలో బీసీల జనాభా తక్కువగా... ఓసీల జనాభా ఎక్కువగా వచ్చిందన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా కుల గణన చేపట్టి... బీసీలకు 42 శాతం స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు ఇచ్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. అలాగే ఈ 26 కులాలను కూడా బీసీ జాబితాలో చేర్చాలని ఆళ్ల రామకృష్ణ విజ్ఞప్తి చేశారు.