మేడిగడ్డ ప్రాజెక్టు కుంగుబాటుపై కేసు పెట్టిన రాజలింగమూర్తి  అనే వ్యక్తి దారుణంగా హత్యకు గురయ్యారు. ఈయన ఈ కేసుతో పాటు అనేక భూ వివాదాలపై కేసులు పెట్టారు. పలువురు అధికారులను ఏసీబీకి పట్టించారు. నిన్న గుర్తు తెలియని దుండగులు ఆయన్ను నరికి చంపేశారు. దీనిపై కాంగ్రెస్ విమర్శలు గుప్పించింది. రాజలింగమూర్తి హత్యను తీవ్రంగా ఖండించిన కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్.. నేను బయటికి వెళ్తే మామూలుగా ఉండదు అన్న కేసీఆర్ ఇదేనా అన్నారు.


హత్యా రాజకీయాలను ప్రేరేపించడమేనా?.. రాజలింగమూర్తి హత్య కేవలం మీ రాజకీయ ప్రయోజనాలకోసమే..  కేసీఆర్, హరీష్ రావు,అవినీతి అధికారులను ప్రశ్నించినందుకే మాజీ కౌన్సిలర్ సరళ భర్త హత్య జరిగింది..
కాళేశ్వరం కేసు ఫైనల్ అయితే కేసీఆర్,హరీష్ రావు,అవినీతి అధికారులు జైలుకు పోతరనే బయోత్పాతం సృష్టించడానికే హత్య చేశారు.. కచ్చితంగా తగిన మూల్యం ఉంటుందని అద్దంకి దయాకర్ అన్నారు.


బీఆర్ఎస్ పార్టీకి హెచ్చరిక,ఇది మంచి రాజకీయ సంస్కృతి కాదు.. ఇలాంటి హత్య రాజకీయాలను ప్రోత్సహించడం కేసీఆర్ కు కరెక్ట్ కాదు.. హత్య రాజకీయాలను, కాంగ్రెస్ కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీ సహించరు..
కాంగ్రెస్ దీన్ని తీవ్రంగా పరిగణిస్తదని అద్దంకి దయాకర్ అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: