
అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు మీకు కర్రు కాల్చి వాత పెట్టారన్న మంత్రి జూపల్లి కృష్ణారావు.. అందుకే ఇన్నాళ్లు మొహం చాటేశావ్ .. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ఓటమి అవమానం తట్టుకోలేకే ఫాం హౌస్ కు పరిమితమయ్యావు అని విమర్శించారు.
ఇన్ని నెలలు తెలంగాణ ప్రజలు నీకు గుర్తుకు రాలేదా అని ప్రశ్నించిన మంత్రి జూపల్లి కృష్ణారావు.. పార్టీ సంస్థాగత నిర్మాణం, సిల్వర్ జూబ్లీమీద ఉన్న ప్రేమ రాష్ట్ర ప్రజలపై లేదన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒక్క సీటు కూడా గెలవలేదన్న మంత్రి జూపల్లి కృష్ణారావు.. ఓటమి భయంతోనే ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీ ఆర్ఎస్ పోటీ చేయలేదన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ బీఆర్ ఎస్ కు ఓటమి తప్పదని మంత్రి జూపల్లి కృష్ణారావు జోస్యం చెప్పారు.