ఢిల్లీలో జరుగుతున్న సౌత్ ఏషియా లీడింగ్ ట్రావెల్, టూరిజం ఎగ్జిబిషన్ -2025 వేదికగా ఇన్వెస్టర్లకు ఆహ్వానం పలికిన పర్యాటక మంత్రి కందుల దుర్గేష్.. సుస్థిర, సమగ్ర పర్యాటకాభివృద్ధి, ఆర్థిక పురోభివృద్ధి, ఉపాధి కల్పన, రూ.25 వేల కోట్ల పెట్టుబడులు ధ్యేయంగా అడుగులు వేస్తున్నామని వివరించారు. పీపీపీ విధానంలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేస్తున్నామని వెల్లడించిన మంత్రి దుర్గేష్.. ప్రభుత్వం తరపున ఇన్వెస్టర్లకు మెరుగైన రాయితీలు కల్పించి పూర్తి సహకారం అందిస్తామని భరోసానిచ్చారు.

టెంపుల్, అడ్వెంచర్, ఎకో, వెల్ నెస్, హెరిటేజ్, రిలీజియస్, అగ్రి, మెడికల్, క్రూయిజ్, బీచ్, కోస్టల్, సీప్లేన్, రూరల్, ఫిల్మ్ టూరిజంలను వృద్ధి చేసేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామన్న మంత్రి దుర్గేష్.. జాతీయ, అంతర్జాతీయ పర్యాటకులకు గమ్యస్థానం గా ఏపీని తీర్చిదిద్దుతామని తెలిపారు. రాష్ట్ర సందర్శనకు రావాలని ఇన్వెస్టర్లను కోరిన మంత్రి దుర్గేష్..  ఏపీ పర్యాటకాభివృద్ధిలో భాగస్వామ్యులు కావాలని ఇన్వెస్టర్ల ని కోరారు.

పెట్టుబడిదారులకు భరోసా కల్పించిన మంత్రి దుర్గేష్.. రాష్ట్రవ్యాప్తంగా టూరిజం సర్క్యూట్‌లు, యాంకర్‌ హబ్‌లు, థీమాటిక్‌ అప్రోచ్‌ ఏర్పాటు, అంతర్జాతీయ మౌలిక వసతుల కల్పన ఉందన్నారు. పర్యాటకుల భద్రతకు ప్రభుత్వం  బాధ్యత తీసుకుంటుందని ఏపీ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ వివరించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: