తిరుపతిలో జరిగిన అంతర్జాతీయ దేవాలయాల ముగింపు సదస్సులో ప్రసంగించిన నారా లోకేష్.. ప్రజల్లో భక్తి భావం పెంచాల్సిన బాధ్యత ప్రభుత్వం, దేవాలయాల వ్యవస్థపై ఉందన్నారు. పిల్లలను సెల్ ఫోన్లకు దూరంగా ఉంచాలన్నారు. అదే సమయంలో తన కుమారుడు దేవాన్ష్ కోసం తాము తీసుకుంటున్న జాగ్రత్తలను వివరించారు.

నా కుమారుడు దేవాన్ష్ కు తొమ్మిదేళ్ళు.. దేవాన్ష్ కు ఇప్పటి వరకు ఐప్యాడ్, ఐ ఫోన్ ను కొనివ్వలేదు.. దేవాన్ష్ ను పుస్తకాలకు దగ్గర చేస్తున్నాను..నాలెడ్జ్ పెంచే పుస్తకాలను దేవాన్ష్ కు ఇస్తున్నాం.. అన్నారు నారా లోకేష్.
కలిసికట్టుగా మన భారతీయ సంస్కృతిని కాపాడుకోవాలన్న నారా లోకేష్.. దేశాన్ని వికసిత్ భారత్ గా మార్చాలన్నది ప్రధాని ఆకాంక్షగా వర్ణించారు.

మన దేశ గొప్పతనం, మహనీయుల చరిత్రను తెలియజేసే పుస్తకాలను పిల్లలకు అందించాలన్న నారా లోకేష్.. మన సంస్కృతి, సంప్రదాయాలను చిన్నతనం నుంచే పిల్లలకు నేర్పించాలన్నారు. క్రిష్ణుడు, శ్రీరాముడు, శివుడు ఇలా గొప్పవాళ్ళ గురించి పిలల్లకు చెప్పాలన్నారు.

2047సంవత్సరానికి ఖచ్చితంగా దేశం వికసిత్ భారత్ వైపు వెళుతుందన్న నమ్మకం ఉందన్న నారా లోకేష్.. రాష్ట్రంలో  దూపదీపనైవేధ్యాలకు నోచుకోని ఆలయాలను గుర్తించి పునర్నిస్తున్నామన్నారు. సనాతన ధర్మాన్ని కాపాడుతూ హిందూ దేవాలయాలను సంరక్షిస్తున్నామన్నారు.

రాష్ట్రంలో టెక్నాలజీ ఆధారిత ఆధ్యాత్మిక సేవలను ఆదర్శంగా నిర్వహిస్తున్నామన్న నారా లోకేష్.. ఆధ్యాత్మిక పర్యాటకంలో రాష్ట్రాన్ని అగ్రగామిగా చేసేందుకు కృషి చేస్తున్నామన్నారు. ఎఐ వంటి టెక్నాలజీ వచ్చినా మానవ సమాజాన్ని నడిపించేది ఆ దేవదేవుడే..  పిల్లలకు హారీ పోర్టర్ కథలు, ఎవెంజర్స్ ఎండ్ గేమ్ ల కాదు మన పురాణాల గురించి చెప్పాలని నారా లోకేష్ సూచించారు.



మరింత సమాచారం తెలుసుకోండి: