ఏపీ సీఎం చంద్రబాబు తీరుపై వైసీపీ నేతలు ఏకంగా గవర్నర్ కు ఫిర్యాదు చేశారు. గుంటూరు పర్యటనలో వైఎస్ జగన్ కు జగన్ కు భద్రత కల్పించక పోవడం,  వైఫల్యాలపై చర్యలు తీసుకోవాలని గవర్నర్ కు ఫిర్యాదు చేశారు.  రాజ్ భవన్ లో గవర్నర్ అబ్దుల్ నజీర్ ను  కలిసిన  వైసిపి నేతలు ఈమేరకు వినతి పత్రం ఇచ్చారు. జడ్ ప్లస్ సెక్యూరిటీ ఉన్న జగన్ కు మొన్న  ఏ మాత్రం పోలీసుల రక్షణ కల్పించలేదని మండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ ఆరోపించారు.


ప్రభుత్వం కావాలనే ఇబ్బంది పెట్టాలని జగన్ మోహన్ రెడ్డికి సెక్యూరిటీ ఇవ్వడం లేదని బొత్స సత్యనారాయణ ఆక్షేపించారు. గవర్నర్ ను కలిసి వైఎస్ జగన్ భద్రతపై పిర్యాదు చేసినట్లు బొత్స సత్యనారాయణ తెలిపారు. కోర్టు ఆదేశాలు కూడా అమలు చేయరా అని బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు.


తాము అధికారంలో ఉండగా గత 5 ఏళ్లలో ఎప్పుడైనా చంద్రబాబు పట్ల ఇలా వ్యవహరించామా అని బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. ఈసీ కోడ్ కు జగన్ కు భద్రత కల్పించడానికి సంబంధం లేదని, ముందుగానే సమాచారం ఇచ్చి గుంటూరు మిర్చి యార్డుకు వెళ్ళామని బొత్స సత్యనారాయణ అన్నారు.


జగన్ కు రక్షణ కల్పించకపోవడం పోలీసులు, రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యమేనని బొత్స సత్యనారాయణ అన్నారు. ప్రభుత్వమే కావాలని భద్రత ఇవ్వొద్దని జిల్లా పోలీసులకు చెప్పిందని బొత్స సత్యనారాయణ ఆరోపించారు. అనుమతి లేకుండా వెళ్ళామనేది  అబద్ధమని.. తమ  నాయకుడు భద్రతపై  ఆందోళన ఉందని.. రక్షణ కల్పించాలని బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: