
ప్రభుత్వం ఎల్‌ఆర్‌ఎస్‌తో ఒక్కో ప్లాట్‌పై లక్ష రూపాయల చొప్పున భారం వేసేందుకు ప్రణాళికలు సిద్దం చేసిందని మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. క్రమబద్దీకరణ కోసం సుమారు 25లక్షల అప్లికేషన్లు వచ్చాయని ప్రభుత్వం చెబుతోందని... అంటే ఎల్‌ఆర్‌ఎస్ వల్ల 25లక్షల మందికి నష్టం జరుగుతుందని మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి వివరించారు.
ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీ ప్రకారంగా ఒక్క రూపాయి తీసుకోకుండా ఉచితంగా ఎల్‌ఆర్‌ఎస్ అమలు చేయాలని మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి డిమాండ్ చేశారు. ఇచ్చిన మాట ప్రకారం ఎల్ఆర్ఎస్ ఉచితంగా అమలు చేయకపోతే రేవంత్ రెడ్డి తో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీతక్క, కోమటి రెడ్డి రాజీనామా చేయాలని.. మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి డిమాండ్ చేశారు.