కృష్ణా నదీ యాజమాన్య బోర్డు ఇవాళ ప్రత్యేకంగా సమావేశం కానుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాటాకు మించి నీరు ఉపయోగించుకుంటోందని, తమకు నష్టం జరుగుతుందన్న తెలంగాణ ఫిర్యాదు నేపథ్యంలో బోర్డు ప్రత్యేక సమావేశం జరగనుంది. ఛైర్మన్ అతుల్ జైన్ సమావేశంలో ఇవాళ మధ్యాహ్నం ప్రత్యేక సమావేశం జరగనున్నట్లు రెండు రాష్ట్రాలకు సమాచారం ఇచ్చారు.

ఏపీ జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, తెలంగాణ నీటిపారుదలశాఖ ముఖ్యకార్యదర్శితో కేఆర్ఎంబీ ఛైర్మన్ సమావేశం కానున్నారు. ఏపీ కృష్ణా జలాలను ఎక్కువగా తీసుకుంటోందని, నిలువరించాలని తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇప్పటికే కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్ ను కోరారు.

తాజాగా నిన్న  కృష్ణా బోర్డు ఛైర్మన్ అతుల్ జైన్ తో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమావేశమయ్యారు. ఏపీకి అడ్డుకట్ట వేయాలని, తెలంగాణకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఇవాళ ఈ అంశాలపై చర్చిస్తారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

ap