చంద్రబాబు ప్రభుత్వం వ్యవసాయం దండగ అనే రీతి లో వ్యవహరిస్తోందని శాసన మండలి ప్రతి పక్ష నేత బొత్స సత్యనారాయణ విమర్శించారు. గ్రామాలకు వెళ్ళితే యూరియా కోసం తెలుస్తుందని.. మిర్చి రైతులు కలవడానికి వెళ్తే లీగల్ యాక్టివిటీ అంటున్నారుని.. బొత్స సత్యనారాయణ అంటున్నారు.

కేంద్ర మంత్రి రాంమోహన్ నాయుడు ఇప్పటికయినా వ్యవసాయ శాఖ మంత్రి కలసి మిర్చి రైతులకు మేలు చేసే చర్యలు చేస్తున్నారు సంతోషమన్న బొత్స సత్యనారాయణ.. ప్రభుత్వ భూ అక్రమాలు పై టైం బ్యాండ్ పెట్టి భూ అక్రమాలు పై చర్య తీసుకోవాలన్నారు.

మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి  జడ్ కేటగిరీ సెక్యురిటి ఉందని.. ఆ జడ్ కేటగిరి సెక్యురిటి ఒక్కరోజు తొలగించారని.. ఈ విషయం తెలిసి గవర్నర్  ఆశ్చర్య పోయారని.. బొత్స సత్యనారాయణ అన్నారు. చంద్రబాబు ప్రభుతం రైతాంగానికి ప్రాధాన్యత  ఇవ్వడం లేదన్న బొత్స సత్యనారాయణ.. మిర్చి యార్డ్ వెళ్ళడానికి ఎన్నికల సంఘం ఎక్కడ అడ్డు చెప్పలేదు. విసి నియామకం చెయ్యడానికి కోడ్ అడ్డు రాలేదా.. ఈ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఈ రోజు వరకు వైసిపి ఏ మద్దతు ప్రకటించలేదని బొత్స సత్యనారాయణ తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: