
ప్రస్తుతం ఉద్యమం పతాక స్థాయికి చేరిందని.. ఈ దశలో కులాలు, ప్రాంతాలకు అతీతంగా ఉద్యమాన్ని దేశవ్యాప్తంగా ఉధృతం చేయాలని ఆర్. కృష్ణయ్య పిలుపునిచ్చారు. మార్చి 12, 13 వ తేదీల్లో చలో దిల్లీ బీసీ మేధావుల సదస్సును... పెద్ద ఎత్తున విజయవంతం చేయాలని ఆర్. కృష్ణయ్య కోరారు. పార్లమెంటులో బి.సి. బిల్లు ప్రవేశపెట్టి, చట్ట సభల్లో బీసీ లకు 50 శాతం రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలన్నారు. బి.సి ఉద్యోగులకు ప్రమోషన్లను రిజర్వేషన్లు కల్పించాలని.. ఇందుకు రాజ్యాంగ సవరణ చేయాలని ఆర్. కృష్ణయ్య విజ్ఞప్తి చేశారు.
కేంద్ర విద్యా, ఉద్యోగ రిజర్వేషన్లు బి.సి.ల జనాభా ప్రసాదం 27శాతం నుండి 56 శాతంకు పెంచాలని ఆర్. కృష్ణయ్య కోరారు. పంచాయతీరాజ్ సంస్థలో బి.సి. రిజర్వేషన్లను 22 శాతం నుంచి 50 శాతంకు పెంచాలని... ఈ రిజర్వేషన్లకు రాజ్యాంగ భద్రత కల్పించాలని ఆర్. కృష్ణయ్య కోరారు. ఓబిసి డిమాండ్ సాధనకు దేశవ్యాప్తంగా ఉద్యమించాలని.. ఆర్. కృష్ణయ్య కోరారు. జాతీయ బీసీ సంక్షేమ సంఘం, ఆంధ్రప్రదేశ్ బీసీ సంఘం, దక్షిణాది రాష్ట్రాల ఓబీసీ సంఘం ఆధ్వర్యంలో... బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో.. కృష్ణయ్య ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.