తెలంగాణ రాష్ట్రంలో విద్యా వ్యవస్థను బలోపేతం చేయడంపై విద్యా కమిషన్ రూపొందించిన నివేదికను ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డికి అందజేసింది. కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి, సభ్యులు ప్రొ. పీఎల్ విశ్వేశ్వరరావు , చారగొండ వెంకటేష్ , జ్యోత్స్నా శివారెడ్డి జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి నివేదికను అందజేశారు.


ప్రీప్రైమరీ నుంచి యూనివర్సిటీ స్థాయి వరకు సాంకేతిక విద్యతో పాటు సమగ్ర విద్యా విధానాన్ని రూపొందించేందుకు విద్యా కమిషన్‌ను ఏర్పాటు చేయగా, కమిషన్ ప్రస్తావించిన అంశాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్షించారు.

తెలంగాణ రాష్ట్రంలో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లతో పాటు అన్ని ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి చేపట్టాల్సిన చర్యలను సభ్యులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తెచ్చారు. ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పెండింగ్ బిల్లులు, పాఠశాల నిర్వహణ సమస్యలను సీఎం రేవంత్ రెడ్డికి  వివరించారు.

విద్యా విషయాల్లో అన్ని సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని, ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు ఏర్పాటు చేయడంతోపాటు, విద్యా వ్యవస్థను బలోపేతం చేసేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: