ఆంధ్రప్రదేశ్ శాసనసభ, మండలి సమావేశాలు ఇవాళ్టి నుంచి ప్రారంభం కాబోతున్నాయి. ఈ సమావేశాలకు జగన్ కూడా రావాలని నిర్ణయించడంతో సంచలనంగా మారింది. ఈ సమావేశాల్లో టీడీపీ, వైసీపీ నేతల మధ్య హోరాహోరీ చర్చలు జరిగే అవకాశం ఉంది. ఈ సమావేశాల  ఏర్పాట్ల పై స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ రాజు, ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్, అసెంబ్లీ కార్యదర్శి జనరల్ ప్రసన్నకుమార్ సూర్యదేవర, సీఎస్‌ విజయానంద్, డీజిపి హరీష్ కుమార్ గుప్తా లు పాల్గొన్నారు.

గవర్నర్ ప్రసంగానికి  ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలందరూ సభకు హాజరవుతారని స్పీకర్‌ తెలిపారు. శాసనసభ భద్రతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, పోలీసు శాఖకు సహకరించాలని స్పష్టం చేశారు. సమావేశాల సమయంలో కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ముఖ్యమంత్రిని కలిసే సందర్శకులు, ప్రతినిధులు శాసనసభ ప్రాంగణంలో కాకుండా సీఎం కార్యాలయంలోనే భేటీ కావాలని సూచించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: