కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కాపాడుతోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అంటున్నారు. సోషల్ మీడియాలో స్ఫందించిన కేటీఆర్... అమృత్ స్కాంని పై ఆధారాలు సమర్పించినా ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదని విమర్శించారు. అనుభవం లేకపోయినా.. రేవంత్ రెడ్డి తన బావమరిదికి అమృత్ పథకం కింద రూ. 1, 137 కోట్ల కాంట్రాక్టును కట్టబెట్టారని కేటీఆర్ మండిపడ్డారు.

అమృత్ స్కామ్ పై ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు లేవన్న కేటీఆర్... బిల్డర్ల దగ్గర నుంచి స్వయంగా పీఎం మోదీనే పేర్కొన్నా.. ఎన్ డీఏ ప్రభుత్వం చర్యలు తీసుకోలేదన్నారు.  రెవెన్యూ మంత్రి పై జరిగిన ఈడీ దాడుల్లో పెద్ద మొత్తంలో డబ్బు గుర్తించినట్టు మీడియా కథనాలు వచ్చినా... ఇప్పటి వరకు ఎందుకు మళ్లీ దానిపై మాట్లాడలేదని కేటీఆర్ ప్రశ్నించారు.

కనీసం ఎస్ఎల్ బీసీ టన్నెల్ కూలిన ఘటనలు, సుంకిశాల రిటైనింగ్ వాల్ పడిపోయిన ఘటనలపై అయినా కనీసం నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వంటి ఏజెన్సీలు అయినా స్ఫందిస్తాయామో వేచి చూడాలని కేటీఆర్ అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: