
కేఫ్ కాంట్రాక్ట్‌ను శ్రీనివాస్‌రెడ్డి అనే ప్రైవేటు వ్యక్తికి ఇచ్చి గౌడన్నల ఆత్మగౌరవంపై దెబ్బకొట్టారని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు. నెక్లెస్ రోడ్‌లోని నీరా కేంద్రాన్ని సందర్శించిన ఆయన.... బీసీ కార్పొరేషన్ ద్వారా 20 కోట్ల రూపాయలు వెచ్చించి నీరా కేఫ్‌ను అందుబాటులోకి తెచ్చామన్నారు.
ఈ ప్రభుత్వం నీరా పాలసీని, నీరా కేంద్రాన్ని ఎత్తివేస్తూ ప్రైవేటుపరం చేయడం బాధాకరమని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. తాము తెచ్చిన నీరా కేంద్రాలను జిల్లాల్లో విస్తరిస్తారనుంకుంటే... ఉన్నవాటిని తీసేస్తున్నారని శ్రీనివాస్ గౌడ్ విమర్శించారు.
ఇలాంటి ధోరణిని అన్ని కులాల వారు వ్యతిరేకించాల్సిన అవసరం ఉందని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. నీరా కేఫ్ ప్రైవేటు కాంట్రాక్టు ఆలోచనను ప్రభుత్వం వారం రోజుల్లో వెనక్కి తీసుకోకపోతే.... గౌడన్నల ఆగ్రహానికి గురికాక తప్పదని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ హెచ్చరించారు. అసెంబ్లీ, సెక్రటేరియట్ సహా హైదరాబాద్‌ను ముట్టడిస్తామని శ్రీనివాస్ గౌడ్ తేల్చిచెప్పారు.