తెలంగాణ సర్కారు బీఆర్‌ఎస్‌ చేసిన స్కాంలన్నీ సీబీఐకి అప్పగించాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ డిమాండ్ చేశారు. అలా చేస్తే దోషులందరిని బొక్కలో వేస్తామన్నారు. బీఆర్‌ఎస్ నాయకులపై మీరు విచారణ చేస్తూ మమ్ముల్ని అరెస్టు చేయమంటారా అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఉద్దేశించి బండి సంజయ్ ప్రశ్నించారు.


ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో బీజేపీపై సీఎం చేసిన వ్యాఖ్యలపై పట్ల బండి సంజయ్‌ స్పందించారు. చీకటి ఒప్పందాలు మీరు చేసుకుని మాపై బురద చల్లుతారా అని బండి సంజయ్  అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమి భయం సీఎంలో కనిపిస్తోందన్న బండి సంజయ్‌.. సర్వేలన్నీ కాంగ్రెస్‌కు 3వ స్థానమేనని తేల్చేశాయని అందుకే అందులో ఓడినా గెలిచినా పోయేదేమి లేదంటున్నారని ఎద్దేవా చేశారు.


సర్కారుకు ఢోకా లేకుంటే ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి సీఎం ఎందుకొచ్చినట్లు అని బండి సంజయ్‌ ఎద్దేవా చేేశారు. రాష్ట్రంలో 51 శాతమున్న బీసీలను 46 శాతానికి తగ్గించి బుకాయిస్తారా అని బండి సంజయ్ మండిపడ్డారు. బీసీ జాబితాలో ముస్లీంలందరిని కలిపి బీసీలకు అన్యాయం చేస్తూ మేలు చేసినట్లు అబద్దాలాడుతారా అంటూ బండి సంజయ్ ఆరోపించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

kcr