రాష్ట్రాభివృద్ధిలో కీలక ఖనిజాలైన కోబాల్ట్, టైటానియం, గ్రాఫైట్, క్రోమియం, టంగ్ స్టన్, యాంటీమోనీ, రీనియం, ఇండియంతో పాటు రేర్ ఎర్త్ మినరల్స్ వంటి కీలక ఖనిజాలపై దృష్టి సారించింది. వాటిని తమతో కలిసి ఉత్పత్తి చేయడానికి ఉమ్మడి భాగస్వామ్యంపై ఆస్ట్రేలియాలోని క్వీన్ లాండ్ రాష్ట్రంతో ప్రాథమికంగా అవగాహనకు వచ్చింది.


సౌర విద్యుత్, పవన విద్యుత్ రంగాలలో తమ తరఫున పూర్తిగా సహకరిస్తామని తెలిపింది.  తెలంగాణ - క్వీన్స్ లాండ్ రాష్ట్ర తమ మైనింగ్, మినరల్ వనరుల సద్వినియోగ వ్యాపారాలకు నోడల్ అధికారులను నియమించాలని నిర్ణయించారు. మార్చి నెలలో క్వీన్స్ లాండ్ లో పెద్ద ఎత్తున నిర్వహించే వ్యాపార సదస్సుకు రావాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆ రాష్ట్రం ఆహ్వానించింది.


సింగరేణి వ్యాపార విస్తరణ చర్యలు అవకాశాలు అనే అంశంపై సీఎండీ బలరామ్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.  త్వరలోనే అన్నింటిపై అధ్యయనం, అవగాహన కోసం సింగరేణి నుంచి ఒక బృందాన్ని క్వీన్స్ లాండ్ కు పంపుతామన్నారు. మైనింగ్ రంగంలో అపారమైన అనుభవం ఉన్న సింగరేణితో సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవడానికి తెలంగాణకు వచ్చామని క్వీన్స్ ల్యాండ్ ఆర్థిక వాణిజ్య శిక్షణ, ఉపాధి శాఖ మంత్రి రోస్ బేట్స్ పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: