
ప్రధాన ముద్దాయిలు ప్రభాకర్ రావు, శ్రవణ్ రావు లు దేశం విడిచి పోయారని ద్వజమెత్తారు. వాళ్ళను తీసుకరావడానికి రెడ్ కార్నర్ నోటీసు ఎందుకు ఇవ్వలేదని కేంద్రాన్ని సామా రామ్మోహన్ రెడ్డి ప్రశ్నించారు. ఇంటర్‌పోల్‌లో ఎందుకు పెట్టలేదని నిలదీశారు. ఎందుకు ముందుకు పోలేకపోతున్నారో...బండి సంజయ్ చెప్పాలని సామా రామ్మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. ప్రభాకర్ రావుని దేశానికి తీసుక రాకుండా అడ్డుకుంటుంది ఎవరు ? మీరు కాదా? అని సామా రామ్మోహన్ రెడ్డి నిలదీశారు.
బిఆరెస్ ను కాపాడుతుంది, అసలు దోషులను రాష్ట్రానికి రాకుండా కాపాడుతుందే బండి సంజయ్ ప్రభాకర్ రావు పై చర్యలు తీసుకోవాలంటే వెంటనే రెడ్ కార్నర్ నోటీసు నుంచి తప్పించుకోవడానికి బిఆరెస్ ఎమ్మెల్సీ ఎన్నికలను బీజేపికి తాకట్టు పెట్టిందని సామా రామ్మోహన్ రెడ్డి విమర్శించారు.