
అన్ని రోజుల్లో ట్రైన్ రైడ్ పెద్దలకు 80 రూపాయలు, పిల్లలకు 40 రూపాయలు చొప్పున నిర్ణయించారు. బ్యాటరీ ఆపరేటెడ్ వాహనం ఎక్కితే పెద్దలకు 120 రూపాయలు, పిల్లలకు 70 రూపాయలు చొప్పున రుసం నిర్ణయించారు. సఫారి పార్కు డ్రైవ్ సీఎన్‌జీ బస్ 20 నిమిషాలకు ఏసీ 150 రూపాయలు, నాన్ ఏసీ 100 రూపాయలు చొప్పున వసూలు చేస్తారు. 11 సీట్లు గల న్యూ బ్యాటరీ ఆపరేటెడ్ వెహికల్‌లో 60 నిమిషాలపాటు షికారు చేస్తే 3000 రూపాయలు, 14 సీట్ల బీఓవీ ఎక్స్‌క్లూజివ్ వాహనంలో కలియ తిరిగితే 4000 రూపాయల చొప్పున రుసుం వసూలు చేయనున్నారు.
జూ పార్కు సందర్శించేందుకు తీసుకొచ్చే వాహనాలు పార్కింగ్ సంబంధించి సైకిల్‌కు 10 రూపాయలు, బైక్ 30 రూపాయలు, ఆటో 80 రూపాయలు, కారు లేదా జీప్ 100 రూపాయలు, టెంపో లేదా తూఫాన్ 150 రూపాయలు, 21 సీట్లు గల మినీ బస్ 200 రూపాయలు, 21 సీట్లు పైగా ఉన్న బస్ 300 రూపాయల చొప్పున ధరలు నిర్ణయించినట్లు జంతు ప్రదర్శనశాల నిర్వాహకులు తెలిపారు.