హైదరాబాద్ లో మరో ప్రత్యేకమైన యూనివర్శిటీ ఏర్పాటు కాబోతోంది. త్వరలోనే మంత్రివర్గం సమావేశంలో లైఫ్‌ సైన్సెస్‌ పాలసీపై నిర్ణయం తీసుకుంటామని పరిశ్రమలశాఖ మంత్రి శ్రీధర్‌బాబు తాజాగా వెల్లడించారు. దేశంలోనే తొలిసారిగా రాష్ట్రంలో లైఫ్‌ సైన్సెస్‌ యూనివర్శిటీని ఏర్పాటు చేయబోతున్నామని పరిశ్రమలశాఖ మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు.


అయితే ఈ యూనివర్శిటీని ఎక్కడ ఏర్పాటు చేయాలనే అంశంపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని మంత్రి స్పష్టం చేశారు. హైదరాబాద్ హెచ్‌ఐసీసీలో జరుగుతున్న బయో ఆసియా సదస్సులో మంత్రి మాట్లాడారు. పరిశ్రమల భాగస్వామ్యంతో ఇప్పటికే స్కిల్‌ యూనివర్శిటీని ఏర్పాటు చేసినట్లు శ్రీధర్‌బాబు తెలిపారు.


రాష్ట్రంలో ఫార్మారంగంలో పరిశ్రమలను ఏర్పాటు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారని మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు.  కాలుష్యం లేకుండా వీటిని టైర్ 2, టైర్ 2 నగరాలు, పట్టణాల్లో ఏర్పాటు చేస్తామని వికారాబాద్, జహీరాబాద్ లో ఇప్పటికే స్థలాలను గుర్తించినట్లు పరిశ్రమలశాఖ మంత్రి శ్రీధర్‌బాబు వివరించారు. ప్రభుత్వం ప్రజలు తెలిపే నిరసన, అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుని... అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకుంటామని పరిశ్రమలశాఖ మంత్రి శ్రీధర్‌బాబు అన్నారు.


రాష్ట్రంలో యూఎస్ దిగ్గజ కంపెని ఆమ్జెన్, మరికొన్ని దిగ్గజ సంస్థలు 5వేల కోట్లు పెట్టుబడి పెట్టేందుకు ముందుకు రావడం సంతోషకరమని శ్రీధర్‌బాబు పేర్కొన్నారు. ఇప్పటికే అనేక రంగాల హబ్ గా వెలుగొందుతున్న హైదరాబాద్.. లైఫ్‌ సైన్సెస్‌ యూనివర్శిటీ మరిన్ని అవకాశాలను అందుబాటులోకి తెచ్చే అవకాశం ఉంది.





మరింత సమాచారం తెలుసుకోండి: