లైఫ్‌ సైన్సెస్, ఫార్మాసూటికల్స్, హెల్త్‌ కేర్ రంగాల్లో భారతదేశం విశేషమైన పురోగతి సాధిస్తోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి  అన్నారు. డ్రగ్స్, ఫార్మాసూటికల్స్ ఉత్పత్తిలో భారత్ ప్రపంచంలో మూడో స్థానంలో ఉందని.. త్వరలోనే వీటిలో ఇండియా నెంబర్ వన్ గా మారనుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ప్రజలకు మందులు అందుబాటులో ఉండాలన్న సంకల్పంతో ప్రపంచ అవసరాల్లో 60 శాతానికి పైగా వ్యాక్సిన్లు, 20 శాతం జెనరిక్ మందులను భారత్ నుంచే సరఫరా చేస్తున్నట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి  తెలిపారు.


పదేళ్లలో భారత ఫార్మా ఉత్పత్తుల ఎగుమతుల విలువ దాదాపు రెట్టింపు అయిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి  అన్నారు. హైదరాబాద్ ముత్యాల నగరంగానే కాకుండా, ప్రపంచ ఫార్మసీగా, అంతర్జాతీయ స్థాయి ఆస్పత్రులు హబ్‌గా ఖ్యాతికెక్కిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఈ నేపథ్యంలో 22వ ఎడిషన్ బయో ఆసియా-2025 లాంటి గ్లోబల్ ఈవెంట్స్ నగర వేదికగా జరగడం, హెల్త్‌కేర్ రంగంలోని సాంకేతికత, సుస్థిరమైన పద్ధతుల గురించి చర్చించడం చాలా సంతోషంగా ఉందన్నారు.


బయో ఆసియా సదస్సు ముగింపు కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.. ఉత్తమ ప్రతిభ కనబర్చిన అంకుర పరిశ్రమలకు బహుమతి ప్రదానం చేశారు. మోదీ సర్కారు భారత దేశాన్ని అన్ని రంగాల్లోనూ అగ్ర స్థానంలో నిలిపేలా చర్యలు తీసుకుంటోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి  అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: