పార్లమెంటు సీట్ల పునర్విభజనతో దక్షిణాది రాష్ట్రాలు దారుణంగా నష్టపోతాయన్న ఆందోళనలు తలెత్తుతున్నాయి. అయితే డిలిమిటేషన్ తో దక్షిణాదిలో పార్లమెంట్ సీట్లు తగ్గవని బీజేపీ రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ స్పష్టం చేశారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం గత పదకొండు సంవత్సరాలుగా పేదల సంక్షేమం కోసం పని చేస్తుంటే... ప్రతిపక్షాలు ఓర్వలేక తప్పుడు ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు.


ప్రాంతీయ పార్టీలు ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నాయని బీజేపీ రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్  ఆవేదన వ్యక్తం చేశారు. కులం, మతం పేరుతో ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడుతున్నాయని బీజేపీ రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ విమర్శించారు. డిలిమిటేషన్ జరిగితే దక్షిణాదిన పార్లమెంటు సీట్లు తగ్గుతాయని తప్పుడు ప్రచారం చేస్తున్నారని బీజేపీ రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.


పార్లమెంటు స్థానాలు తగ్గుతాయని డిఎంకే స్టాలిన్, బీఆర్ఎస్ కేటీఆర్ పదే పదే తప్పుడు ప్రచారం చేస్తున్నారని బీజేపీ రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ దుయ్యబట్టారు. దక్షిణాదిలో సీట్లు తగ్గవని ప్రధాని మోడీ, హోం మంత్రి అమిత్ షా స్వయంగా చెప్పారని బీజేపీ రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్  గుర్తు చేశారు. ప్రజలు డీఎంకే, బీఆర్ఎస్ తప్పుడు ప్రచారాన్ని నమ్మవద్దని పిలుపునిచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: