మాజీ మంత్రి హరీష్ రావును టార్గెట్ చేసినట్టు కనిపిస్తోంది. ఆయనపై వరుసగా కేసులపై కేసులు నమోదవుతున్నాయి. తాజాగా హరీశ్ రావుపై మరో కేసు నమోదయింది. హరీష్ రావు తో పాటు ఇటీవల జైలు నుండి విడుదలైన తన అనుచరులు బెదిరింపులు దిగుతున్నారని.. రియల్టర్ చక్రధర్ గౌడ్ ఫిర్యాదు మేరకు బాచుపల్లి పోలీసులు వంశీకృష్ణ, హరీష్ రావు, సంతోష్ కుమార్, పరశురాములు పై కేసు నమోదు చేశారు.


అయితే ఈ కేసులో హరీష్ రావును రెండవ నిందితుడిగా పోలీసులు చేర్చారు. ఈ మేరకు హరీష్ రావు ఫై 351 (2) R/W 3, (5) BNS యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేసిన బాచుపల్లి పోలీసులు. ఫోన్ ట్యాపింగ్ కేసు కేసు పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో కూడా నమోదయింది. ఈ కేసులో  వంశీకృష్ణ, పరశురాములు, సంతోష్ కుమార్ అరెస్టు అయి బెయిల్ పై విడుదలయ్యారు.


బెయిల్ పై విడుదలయిన సమయంలో వంశీకృష్ణ మీడియాతో మాట్లాడుతూ పంజాగుట్ట పోలీసులను దర్యాప్తు పై విమర్శించడంతో పాటు గా తన మీద కక్ష తీసుకుంటానని పేర్కొన్నాడని రియల్టర్ చక్రధర్ గౌడ్  తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఇందుకు సంబంధించిన ఆధారాలను కూడా సమర్పించినట్టు బాధితుడు రియల్టర్ చక్రధర్ గౌడ్  తెలిపాడు. తనకు ప్రాణహాని ఉందని తెలిపాడు. ఈ మేరకు వారి పై చర్యలు తీసుకోవాలని రియల్టర్ చక్రధర్ గౌడ్  కోరాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: