తెలంగాణ కాంగ్రెస్ కొత్త నినాదం అందుకుంది.. అదేంటో తెలుసా.. అదే జై భీమ్‌, జై బాపు, జైం సంవిధాన్‌.. ఇప్పుడు జై భీమ్‌, జై బాపు, జైం సంవిధాన్‌ కార్యక్రమం అవసరమని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి అంటున్నారు. రాష్ట్రంలో కుల గణన, ఎస్సీ వర్గీకరణకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి అన్నారు. కేసీఆర్ కుటుంబం సర్వేలో పాల్గొనలేదని వాళ్లు కూడా సామాజిక న్యాయం గురించి మాట్లాడుతున్నారని మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఎద్దేవా చేశారు.


ఏడాది కాలంలో అనేక పనులు చేశామని. అయితే ప్రచారం చేయడంలో కొంత వెనుకబడిపోయామని మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి తెలిపారు. దేశంలోనే ఈ ఏడాది అత్యంత ఎక్కువ దిగుబడి ధాన్యం పండించినట్లు మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి పేర్కొన్నారు. అనేక సంక్షేమ అభివృద్ది కార్యక్రమాలు చేపట్టామని...ఇవన్నీ కూడా జనంలోకి తీసుకెళ్లి ప్రచారం చేసుకోవాలని మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి వివరించారు.


స్వాతంత్రం వచ్చిన తర్వాత ప్రపంచంలో అనేక దేశాల కంటే మన దేశమే అభివృద్ది చెందిందంటే అది కాంగ్రెస్ ఘనతేనని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీ సమాజంలో అన్ని వర్గాలకు స్వేచ్చ స్వాతంత్రం ఇచ్చిన ఘనత కూడా కాంగ్రెస్‌ పార్టీదేనని మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి తెలిపారు. కానీ నేడు బీజేపీ మోదీ పాలనలో దేశంలో అన్ని రకాలుగా అణచివేత జరుగుతుందని ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఆరోపించారు. గాంధీభవన్‌లో పీసీసీ విస్తృతస్థాయి సమావేశంలో మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి మాట్లాడారు.

మరింత సమాచారం తెలుసుకోండి: