అగ్గిపుల్ల, సబ్బుబిల్ల, కుక్కపిల్ల.. కాదేదీ కవితకనర్హం అన్నారు శ్రీశ్రీ.. ఇప్పుడు రాజకీయ నేతలు కూడా ప్రతి అంశంలోనూ రాజకీయ లబ్ది కోసం ప్రయత్నిస్తున్నారు. అందుకే ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన ఘటనలు ప్రమాదంగా చూడాలే తప్ప రాజకీయ ధోరణిలో చూడడం సరైందికాదని శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అంటున్నారు. హరీష్‌రావు చాలా అనుభవజ్ఞుడు.. ఇరిగేషన్ మంత్రిగా అనుభవం ఉందని రాజకీయం చేయడం మంచిదికాదని మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు.


ఎస్‌ఎల్‌బీసీ ఘటనపై ఎవరికి వారు ఆత్మ విమర్శ చేసుకొని ముందుకు వెళ్లడం మంచిదని గుత్తా సుఖేందర్ రెడ్డి అభిప్రాయపడ్డారు. అన్‌గోయింగ్‌ ప్రాజెక్టులను మొదటి ప్రాధాన్యత ఇచ్చి పూర్తి చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నట్లు గుత్తా సుఖేందర్ రెడ్డి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఎస్‌ఎల్‌బీసీ టెన్నల్‌లో ఇరుక్కు పోయిన కార్మికులను రెస్య్కూ చేయడంలో ఎక్కడ విఫలంకాలేదని గుత్తా సుఖేందర్ రెడ్డి పేర్కొన్నారు.


ఈ ఘటనపై ప్రభుత్వ నిర్లక్ష్యం ఏమాత్రం లేదన్నారు. పెద్ద ప్రాజెక్టులు నిర్మాహనం జరుతున్నప్పుడు అనుకొని ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని...అలాంటి ఘటన ఎస్‌ఎల్‌బీసీ సొరంగంలో జరగడం దురదృష్టకరమని గుత్తా సుఖేందర్ రెడ్డి పేర్కొన్నారు. ప్రమాదాలు అనేవి సహజమని ప్రమాదాలకు భయపడి ప్రాజెక్టులు మూసుకుంటామా గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. ఎన్ని అవాంతరాలు ఎదురైనా ఎస్‌ఎల్‌బీసీని పూర్తి చేస్తామని గుత్తా సుఖేందర్ రెడ్డి వివరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: