
సీఎం రేవంత్ రెడ్డి విపక్ష నేతల కదలికలపై నిఘా పెట్టినట్టు కనిపిస్తోంది. బీఆర్ఎస్ నేతలు విమర్శలు ఇందుకు సాక్ష్యంగా కనిపిస్తున్నాయి. ముఖ్యమంత్రిగా శాంతి భద్రతల మీద దృష్టి సారించకుండా ప్రతిపక్ష నాయకుల కదలికలను తెలుసుకోవడానికి నిఘా వ్యవస్థను ఉపయోగించుకుంటున్నారని బీఆర్ఎస్ కీలక నేతలు విమర్శిస్తున్నారు. సీఎం దృష్టి పెట్టాల్సింది మా ప్రయాణాల మీద కాదు... ప్రజల ప్రయోజనాల మీద .. నిరంతరం మామీద నిఘా పెడుతున్నారంటే అభద్రతతో కొట్టుమిట్టాడుతున్నారని అనుకోవాలని బీఆర్ఎస్ కీలక నేతలు గుర్తు చేస్తున్నారు.
ఎస్ ఎల్ బీ సీ ప్రమాదం జరిగి తొమ్మిది రోజులు గడిచిన కార్మికులను కాపాడకపోగా... కనీసం మృతదేహాలను బయటకు తీయలేని చేతగాని ప్రభుత్వం.. ప్రభుత్వంలో ఉన్నవాళ్లు దుబాయిలో విలాసాలు చేయడాన్ని ఎలా సమర్ధించుకుంటారని బీఆర్ఎస్ కీలక నేతలు ప్రశ్నిస్తున్నారు. మానవత్వం మరిచి ఎన్నికల ప్రచారానికి పోవడాన్ని ఎలా సమర్థించుకుంటారని బీఆర్ఎస్ కీలక నేతలు నిలదీస్తున్నారు. బాధ్యతలను మరచి విలాసాల్లో, విహారాల్లో మునిగింది... రాజకీయాలు చేసింది సీఎం, మంత్రులు.. ప్రజలు అన్నీ గమనిస్తున్నారంటున్నారు బీఆర్ఎస్ కీలక నేతలు.