మాజీ సీఎం కేసీఆర్ ఇటీవల పెద్దగా బయటకు రావట్లేదు. చాలా అరుదుగా ప్రజల్లోకి వస్తున్నారు. ఎక్కువగా ఫామ్ హౌస్ కే పరిమితం అవుతున్నారు. అయితే ఆయన తాజాగా ఓ నాయకుడిని ఇంటికి పిలిపించుకుని మరీ సాయం చేశారు.


ఆ వివరాల్లోకి వెళ్తే.. ఖమ్మం జిల్లాకు చెందిన బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ ఖమ్మం టౌను బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు డోకుపర్తి సుబ్బారావు.. సోషల్ మీడియా వేదిక ద్వారా కేసీఆర్ సందేశ్ పేరుతో, పార్టీ కార్యకలాపాలను ప్రజల్లోకి తీసుకుపోతున్న  గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు.


ఈ  విషయం తెలుసుకున్న పార్టీ అధినేత కేసీఆర్.. డోకుపర్తి సుబ్బారావును ఎర్రవెల్లి నివాసానికి పిలిపించుకున్నారు. వారి యోగక్షేమాలు,ఆరోగ్య పరిస్థితిని ఆరా తీసి ధైర్యం చెప్పారు. వైద్య ఖర్చుల నిమిత్తం రూ. పదిలక్షల చెక్కును సుబ్బారావుకు కేసీఆర్ అందజేశారు. తనను ఆపదలో ఆదుకున్న పార్టీ అధినేతకు సుబ్బారావు దంపతులు కృతజ్జతలు తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: