
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మరోసారి ఢిల్లీ వెళ్తున్నారు. ఈ నెల 5వ తేదీ నుంచి వరుసగా 3 రోజుల పాటు ఢిల్లీలో పర్యటించబోతున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, హోమ్ మంత్రి అమీత్షా లతో చంద్రబాబు కీలక భేటీలు నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. తన ఢిల్లీ పర్యటనలో కేంద్ర ప్రభుత్వ పెద్దల్ని కలవనున్న సీఎం చంద్రబాబు ఏపీ రాష్ట్ర అవసరాల పై వారితో కీలకంగా చర్చించనున్నట్లు చెబుతున్నారు.
ఈ మధ్యలోనే విశాఖ వెళ్లనున్న సీఎం..., ఆయన తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరావు పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొంటారు. దగ్గుబాటి రచించిన "ప్రపంచ చరిత్ర" (ఆది నుండి.. నేటి వరకు..) పుస్తక ఆవిష్కరణ కార్యక్రమానికి చంద్రబాబు తో పాటు కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడులు పాల్గొంటారు. కార్యక్రమం అనంతరం తిరిగి ఢిల్లీ వెళ్లనున్న సీఎం చంద్రబాబు.. తన పర్యటన ను తిరిగి కొనసాగిస్తారు. 6వ తేదీ రాత్రి ఢిల్లీలోనే బస చేయనున్న సీఎం 7న అమరావతి వచ్చే అవకాశం కనిపిస్తోంది.