తెలుగు సినిమాల్లో హీరోల పాత్ర తీరు పట్ల దర్శకులు పద్దతి మార్చుకోవాలని మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు చేసిన వ్యాఖ్యలు సినీ పరిశ్రమలో కలకలం సృష్టిస్తున్నాయి. స్మగ్లర్లు, దేశ ద్రోహులు, సమాజంలో తప్పుడు విధానాలు పాటించే వాళ్లను హీరోలుగా చూపించడం సమాజంలో ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందన్న వెంకయ్యనాయుడు... సినిమా రంగంలో ఉన్నత ప్రమాణాలు, ఉత్తమ సంప్రదాయాలు, మంచి భాష, హుందా తనానికి పెద్దపీట వేయాల్సిన అవసరం ఉందన్నారు.

ఈ వ్యాఖ్య.లు ఇటీవల వచ్చిన పుష్ప1, 2 చిత్రాల గురించే అన్న చర్చ మొదలైంది. పుష్ప లో హీరో అల్లు అర్జున్ చందనం దొంగ పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. చేసేది స్మగ్లింగే అయినా హీరో యాటిట్యూడ్ ను బాగా హైలెట్ చేశారు. ఇప్పుడు వెంకయ్య దాన్నే తప్పుబట్టారు.

నిన్న అలనాటి నటి, నిర్మాత కృష్ణవేణి సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని హైదరాబాద్ ఫిల్మ్ నగర్ కల్చర్ క్లబ్ లో ఆమె కుటుంబసభ్యులు నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వెంకయ్య హాజరయ్యారు.  సినిమాను బాధ్యతాయుతమైన కళాత్మక వ్యాపారంగా నాటి సినీ రంగ ప్రముఖులు అభివృద్ధి చేశారని, అలాంటి వారిలో కృష్ణవేణి మొదటి వరుసలో నిలుస్తారని వెంకయ్యనాయుడు.. గుర్తు చేశారు. నందమూరి, అక్కినేని కుటుంబసభ్యులతోపాటు పలువురు సినీ ప్రముఖులు హాజరై కృష్ణవేణి చేసిన సేవలను కొనియాడారు.

మరింత సమాచారం తెలుసుకోండి: