
ఈ వ్యవహారమంతా రేవంత్‌రెడ్డి కుటుంబసభ్యుల ప్రోద్భలంతోనే జరుగుతుందని మన్నె క్రిశాంక్ ఆరోపించారు. తెలంగాణకు చెందిన కేపీసీ కంపెనీకి కర్ణాటకలో 210 కోట్ల రూపాయల కాంట్రాక్ట్ కట్టబెట్టారని.... కేపీసీ అనిల్ కుమార్‌కి, సీఎం సోదరుడు తిరుపతిరెడ్డికి మధ్య డీల్ ఎంతకు కుదిరిందో చెప్పాలని మన్నె క్రిశాంక్ ప్రశ్నించారు. బెదిరించడమే రేవంత్‌రెడ్డి అజెండా అన్న క్రిశాంక్.. ముందు సీఎం బెదిరిస్తే.. తర్వాత ఆయన సోదరుడు సెటిల్ చేస్తారంటూ మన్నె క్రిశాంక్ సెటైర్లు వేశారు.
ఎస్ఎల్ బీసీ వద్దకు బీఆర్ఎస్ నేతలు వెళితే అడ్డుకుని.. బీజేపీ నేతలను మాత్రం దగ్గరుండి సొరంగంలోకి తీసుకెళ్లారని మన్నె క్రిశాంక్ విమర్శించారు. వీటన్నిటిపై బీజేపీ ప్రభుత్వం విచారణ చేయించకపోవడంతో.. ఆ రెండు పార్టీలు ఒక్కటేనని స్పష్టమవుతుందని మన్నె క్రిశాంక్ అన్నారు. రేవంత్ సర్కారుపై బీజేపీ విచారణ చేయించినా, చేయించకపోయినా.. రెండు పార్టీలనూ తమ పార్టీ ప్రశ్నిస్తూ నిజాలను ప్రజల ముందు ఉంచుతుందని మన్నె క్రిశాంక్ అన్నారు.