సింగరేణి వ్యాపార విస్తరణలో మరో ముందడుగు పడింది. రాజస్థాన్ విద్యుత్ సంస్థతో 3100 మెగా వాట్ల విద్యుత్ ప్రాజెక్టులపై ఒప్పందం చేసుకోనుంది. రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్ లాల్ శర్మ, తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు సమక్షంలో ఎం.ఓ.యూ చేసుకోనున్నారు.  ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఎనర్జీ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా, సింగరేణి సీఎండీ ఎన్.బలరామ్, ట్రాన్స్ కో సీఎండీ కృష్ణ భాస్కర్ లు రాజస్థాన్ రాష్ట్రానికి చేరుకున్నారు.


రాజస్థాన్ విద్యుత్ అనుబంధ సంస్థతో  కలిసి జాయింట్ వెంచర్ కంపెనీ ఏర్పాటు చేసుకుంటామని ప్రభుత్వం తెలంగాణ వెల్లడించింది. ఈ జాయింట్ వెంచర్ కంపెనీతో 1600 మెగావాట్ల థర్మల్ విద్యుత్ , రాజస్థాన్ లో 1500 మెగావాట్ల  సోలార్ విద్యుత్తు ఉత్పాదనకు ఒప్పందం కుదిరింది. సింగరేణి ఆర్థిక పరిపుష్టికి ఇది అతి పెద్ద అవకాశం అని సింగరేణి యాజమాన్యం తెలిపింది. మొత్తం వ్యయం, లాభాల్లో 74శాతం సింగరేణికి, 26శాతం రాజస్థాన్ విద్యుత్ ఉత్పాదన్ నిగం లిమిటెడ్ కు వాటా ఉంటుంది. ఈ ఒప్పందంతో తొలిసారిగా ఇతర రాష్ట్రాల్లో అతి పెద్ద సోలార్ విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుతో జాతీయ స్థాయి కంపెనీగా సింగరేణికి గుర్తింపు రాబోతుందని సింగరేణి యాజమాన్యం వెల్లడించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: