ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో చిక్కుకున్న కార్మికులందరినీ సురక్షితంగా బయిటికి తీసుకొచ్చేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలంటూ తెలంగాణ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. మహబూబ్‌నగర్‌కు చెందిన నేషనల్ యూనియన్ ఫర్ మెగ్రెంట్ లేబర్ అనే సంస్థ ఈ ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేసింది.

ఘటన జరిగి 10 రోజులు కావస్తున్నా ఇంతవరకు కార్మికుల జాడ తెలియలేదని పిటిషనర్లు కోర్టుకు తెలిపారు. కార్మికుల భద్రత కోసం అన్ని చర్యలు తీసుకునేలా ఆదేశాలు జారీ చేయాలని పిటిషనర్లు  కోరారు.


ఈ కేసులో ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి వాదనలు వినిపించారు.  ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. ఆర్మీ, నేవీ, ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్డీఆర్‌ఎఫ్‌తో పాటు సింగరేణి రెస్క్యూ టీం, ఎల్‌ఆండ్‌టీ కంపెనీ పాల్గొన్నాయని ఏజీ తెలిపారు.


24 గంటల పాటు సహాయక చర్యలు కొనసాగుతున్నాయని.... ప్రభుత్వం సైతం క్షుణ్ణంగా పరిశీలిస్తోందని ఏజీ తెలిపారు. ఇరువైపుల వాదనలు విన్న హైకోర్టు అడ్వకేట్ జనరల్ వాదనలను పరిగణలోకి తీసుకొని ప్రజాప్రయోజన వ్యాజ్యంపై విచారణను ముగించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: