చంద్రబాబుకు బీజేపీ బిగ్ షాక్ ఇచ్చింది. బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి గా సోము వీర్రాజును బీజేపీ కేంద్ర అధిష్టానం ఖరారు చేసింది. చంద్రబాబు బద్ద వ్యతిరేకిగా పేరున్న సోము వీర్రాజుకు ఎమ్మెల్సీ ఇవ్వడం ఆసక్తి రేపుతోంది. ఇప్పటికే ఓసారి ఎమ్మెల్సీగా చేసిన సోము వీర్రాజుకు బీజేపీ హైకమాండ్ మరోసారి ఛాన్స్ ఇచ్చింది. 5 ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నిక నామినేషన్ దాఖలుకు నేడు చివరి రోజు కావడంతో బీజేపీ చివరి నిమిషంలో తన అభ్యర్థిని ప్రకటించింది. ఐదింటిలో తెలుగుదేశం 3, జనసేన, బీజేపీలకు చెరొకటి చొప్పున సీట్ల సర్దుబాటు చేసుకున్నాయి.

తెలుగుదేశం తరఫున కావలి గ్రీష్మ, బీదా రవి చంద్ర యాదవ్, బీటీ నాయుడు నేడు నామినేషన్ దాఖలు చేయనున్నారు. తాజాగా బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి గా సోము వీర్రాజు ను బీజేపీ ఖరారు చేయడంతో ఆయన ఇవాళ నామినేషన్ వేయబోతున్నారు. ఇక జనసేన తరఫున నాగబాబు ఇప్పటికే నామినేషన్ దాఖలు చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: