సొంత ఆదాయంలో రాష్ట్రం నంబర్ వన్ అని కేసీఆర్ ఎప్పట్నుంచో చెప్తున్నారని, మొన్నటి వరకు దివాళా అన్న రేవంత్ రెడ్డి ఇవాళ వాస్తవాన్ని గుర్తించారని హరీశ్ రావు వ్యాఖ్యానించారు. బాగా ఉన్న రాష్ట్రాన్ని దివాళా అని దిక్కుమాలిన ప్రచారం చేసి నష్టం చేశారని, ఎమ్మెల్యేలందరికీ ఏసీడీపీ నిధులు ఇవ్వాలని జానారెడ్డి గతంలో అడిగితే కేసీఆర్ అంగీకరించారని, ఇప్పుడు కూడా ఇవ్వాలని హరీశ్ రావు డిమాండ్ చేశారు.
బడ్జెట్‌లో 70 వేల కోట్ల లోటు ఉందని సీఎం గతంలో చెప్పారని, ఇవాళ 95 శాతం బడ్జెట్ నిజం కాబోతోందని అంటున్నారని, ఏది నిజమని హరీశ్ రావు ప్రశ్నించారు.


400 ఎకరాలు అభివృద్ధి అని అందమైన అబద్ధం చెప్పారని, నాడు భూముల అమ్మకాన్ని వ్యతిరేకించి ఇవాళ ఎలా సమర్థించారని హరీశ్ రావు విమర్శించారు. ఐఎంజీ భూముల విషయంలో బీఆర్ఎస్ ప్రభుత్వం హైకోర్టు, సుప్రీంకోర్టులో కొట్లాడిందని, నీటిపారుదల, పౌరసరఫరాల పద్దులపై సభలో మాట్లాడేందుకు బీఆర్ఎస్‌కు అవకాశం ఇవ్వలేదని హరీశ్ రావు ఆరోపించారు.


మల్లన్నసాగర్ భూసేకరణ అడ్డుకునేందుకు ప్రస్తుత మంత్రి దామోదర రాజనర్సింహ కేసులు వేయించారని, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు వ్యతిరేకంగా రేవంత్ రెడ్డి కేసులు వేయించారని హరీశ్ రావు వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీలో చేరానని కడియం శ్రీహరి బహిరంగంగా చెబుతుంటే, సీఎం మాత్రం చేరలేదని అంటున్నారని హరీశ్ రావు విమర్శించారు


మరింత సమాచారం తెలుసుకోండి: