
ఏడో వింత అని గొప్పగా చెప్పుకుంటే మూడేళ్లకే పనికిరాకుండా పోయిందని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. ఇప్పుడు నీళ్లు నిలిపితే మొత్తానికే కూలుతుందని జాతీయ డ్యామ్ సేఫ్టీ నిపుణులు చెప్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. దశాబ్దాల క్రితం కాంగ్రెస్ నిర్మించిన ప్రాజెక్టుల వల్లే రాష్ట్రంలో వరి దిగుబడి పెరిగిందని సీఎం రేవంత్ రెడ్డి గుర్తు చేశారు.
కాంగ్రెస్ ఘనతలను బీఆర్‌ఎస్ ఘనతగా చెప్పుకోవటం సిగ్గుచేటని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. రైతుల ఉచిత కరెంట్ కోసం రూ.33 వేల కోట్లు ఖర్చు చేశామని వెల్లడించారు. గత ప్రభుత్వం పదేళ్లలో చేయని పనులు మేం పది నెలల్లో చేశామని సీఎం రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. వడగళ్ల వానతో పంట నష్టం జరిగితే గత ప్రభుత్వం ఏనాడు పరిహారం చెల్లించలేదని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు.