హైదరాబాద్‌ ఔటర్‌ రింగ్‌రోడ్డు (ఓఆర్‌ఆర్‌)పై ప్రయాణించే వాహనదారులకు టోల్‌ ఛార్జీలు పెరిగాయి.  ఈ కొత్త రేట్లు ఇవాళ్టి నుంచి అమలులోకి రానున్నట్లు అధికారులు ప్రకటించారు. ఓఆర్‌ఆర్‌పై టోల్‌ వసూలు చేస్తున్న ఐఆర్‌బీ ఇన్‌ఫ్రా సంస్థ ఈ నిర్ణయం తీసుకుంది. వాహనాల రకాన్ని బట్టి కిలోమీటర్‌కు ఛార్జీలు పెంచుతూ సవరించిన రేట్లను విడుదల చేసింది.


కారు, జీపు, వ్యాన్‌, లైట్‌ వాహనాలకు కిలోమీటర్‌కు 10 పైసల చొప్పున పెంపు జరిగింది. ఈ వాహనాల ఛార్జీ ఇప్పటి వరకు కి.మీ.కు రూ.2.34గా ఉండగా, ఇకపై రూ.2.44గా వసూలు చేయనున్నారు. అలాగే, మినీబస్‌, లైట్‌ కమర్షియల్‌ వెహికల్స్‌ (ఎల్‌సీవీ)లకు కిలోమీటర్‌కు 20 పైసలు పెంచారు. ఈ వాహనాల టోల్‌ రేటు రూ.3.77 నుంచి రూ.3.94కు పెరిగింది. రెండు యాక్సిల్‌ బస్సులకు కిలోమీటర్‌కు రూ.6.69గా ఉన్న ఛార్జీ ఇక నుంచి రూ.7గా ఉంటుంది.


భారీ వాహనాలపై మరింత ఎక్కువ భారం పడనుంది. ఈ వాహనాలకు కిలోమీటర్‌కు 70 పైసలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. దీంతో భారీ వాహనాల టోల్‌ ఛార్జీ రూ.15.09 నుంచి రూ.15.79కు చేరింది. ఈ పెంపు వాహనదారులకు అదనపు ఆర్థిక భారం కానుందని, అయితే రోడ్డు నిర్వహణ, మౌలిక సదుపాయాల కోసం ఈ నిర్ణయం అవసరమని ఐఆర్‌బీ ఇన్‌ఫ్రా అధికారులు తెలిపారు. ఈ కొత్త రేట్లు నేటి నుంచి అమలులోకి రానున్న నేపథ్యంలో, ఓఆర్‌ఆర్‌పై ప్రయాణించే వారు తమ ఖర్చులను సర్దుబాటు చేసుకోవాల్సి ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

orr