IHG

 

గడచిన అర్ధరాత్రి జరిగిన ఘటన విశాఖ ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేసింది. విశాఖ పట్నం లోని  ఎల్జీ పాలిమర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ లో నిన్న అర్ధరాత్రి గ్యాస్ లీకేజి తో విషాదం చోటు చేసుకుంది.ఇది ప్లాస్టిక్ రెసిన్ & సింథటిక్ ఫైబర్ తయారీ విభాగం. నిన్న అర్థ రాత్రి జరిగిన సంఘటన వల్ల ఇంట్లో నిద్రపోతున్న ప్రజలు ఒక్క సారిగా ఆ వాయువును పీల్చడం వల్ల అందరూ అక్కడికక్కడే అపస్మారక స్థితి కి వెళ్లారు, ఆ విష వాయువులో ఉన్న  స్థైరిన్ మోనోమర్ ఉన్నట్లు అధికారులు తెలియజేస్తున్నారు.

IHG

 

అయితే విష వాయువు పీల్చిన ప్రజలు ఇళ్లలో , రోడ్లపై , మేడపై , పొలాల్లో  విగత జీవులు గా పడివున్నారు. కొందరు ఆ విష వాయువును పీల్చి అపస్మారక స్థితిలో మేడపై నుండి దూకి చనిపోయారు. మరి కొందరు బావుల్లో , కాలువల్లో పడి చనిపోయారు. ఈ దయనీయ స్థితిని చూడడానికి హృదయవిదారకంగా ఉంది. ఈ సందర్భంలోనే పాక‌ల్లో క‌ట్టేసి ఉన్న ప‌శువులు.. పొలాల్లో ఉన్న ప‌శువులు అక్క‌డే కుప్ప‌కూలిపోయాయి...
ప‌క్షులు గాల్లోనే నుంచి కింద ప‌డిపోయి విల‌విల్లాడుతూ కొట్టుకుని చ‌నిపోయాయి...LG పాలిమర్స్ కంపెనీ పరిసర ప్రాంతాల్లో  ఉన్న పరిస్థితి చుస్తే హృదయ విదారకంగా ఉంది. 

IHG

IHG

మరింత సమాచారం తెలుసుకోండి: