ప్రముఖ జర్మనీ లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడిస్‌-బెంజ్‌ ఆప్‌ గ్రేడెడ్‌ వెర్షన్‌ను ప్రారంభించింది. వినియోగదారుల సౌకర్యార్థం కొత్త మార్పులు తీసుకు వచ్చి  ఏడు సీట్ల స్పోర్ట్స్‌ యుటిలిటీ వాహనం జీఎల్‌ఎస్‌ 350డీను మార్కెట్ లోకి విడుదల చేశారు. ప్రస్తుతం పూణె ఎక్స్ షోరూంలో ఉన్న యుటిలిటీ వాహనం జీఎల్‌ఎస్‌ 350డీ ఖరీదు రూ. 80.4 లక్షలు. భారతదేశంలో ఎస్‌యూవీలకు మంచి ఆదరణ లభిస్తుందని, భారత మార్కెట్‌ తమకు హయ్యెస్ట్‌ గ్రోయింగ్‌ సెగ్మెంట్‌ అని మెర్సిడెస్‌ - బెంజ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌, సీఈఓ రోలాండ్‌ పోల్గేర్‌ విలేకర్లుకు తెలిపారు.

మెర్సిడెస్‌ - బెంజ్‌ జీఎల్‌ఎస్‌ 350డీ


అంతే కాదు భారత్ లో 2015లో 100శాతం వృద్ధి సాధించామని ఈ సందర్భంగా ఆయన అన్నారు. ఈ జిఎల్ఎస్ ఎస్‌యువి మెర్సెడెస్ బెంజ్ యొక్క ఫ్లాగ్‌షిప్ మోడల్. దీనిని దేశీయంగానే ఉత్పత్తి చేయనున్నట్లు మెర్సిడెస్ బెంజ్ ప్రకటించింది.  ఈ నూతన ఎంక్లాస్‌ విలాసవంతంగా ఉండటంతో పాటు భారీత రహదారులకు అనుగుణంగా రూపొందించినట్టు చెప్పారు. మెర్సిడెస్ బెంజ్ తమ జిఎల్‌ఎస్ ఎస్‌యువిలో 3.0-లీటర్ సామర్థ్యం ఉన్న వి6 డీజల్ ఇంజన్‌ను అందుబాటులో ఉంచింది.

మెర్సిడెస్‌ - బెంజ్‌ జీఎల్‌ఎస్‌ 350డీ


ఇందులోని శక్తివంతమైన ఇంజన్ సుమారుగా 255 బిహెచ్‌పి పవర్ మరియు 620 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 9జీ- ట్రానిక్‌ ట్రాన్స్‌మిషన్‌, 3 స్పొక్‌ స్టీరింగ్‌, పానొరామిక్‌ సన్‌రూప్‌, పుల్‌ లెడ్‌ హెడ్‌లాప్స్‌ విత్‌ ఇంటిల్‌జెంట్‌ లైట్‌ సిస్టమ్‌, ఎయిర్‌మెటిక్‌ సస్పెన్షెన్‌ విత్‌ అడాపటివ్‌ డాంపింగ్‌ సిస్టిమ్‌ ప్లస్‌, స్మార్ట్‌ఫోన్‌ ఇంటిగ్రేషన్‌ విత్‌ అపిల్‌ కార్‌ప్లే, యాక్టివ్‌ పార్కింగ్‌ అసిస్‌, 360 డ్రిగీ కెమేరా, బ్రేక్‌ అసిస్ట్‌ తదితర ఫీచర్లు ఉన్నాయని పేర్కొన్నారు


మరింత సమాచారం తెలుసుకోండి: