ఆసియా ఖండం లో అత్యంత పురాతన స్టాక్ ఎక్స్జెంజ్ గా పేరు తెచ్చుకున్న బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ ఇప్పుడు పబ్లిక్ ఆఫర్ కి రాబోతోంది. దాదాపు 1200 కోట్ల మేర నిధులు సమీకరించే క్రమం లో వారు ఈ సీరియస్ నిర్ణయం తీసుకున్నారు. సెక్యూరిటీ అండ్ ఎక్స్ చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా ముసాయిదా పత్రాలని సమర్పించగా ప్రస్తుతం ఉన్న షేర్‌ హోల్డర్లే బీఎస్‌ఈ ఐపీఓ ద్వారా నిధులను రాబట్టే పనిలోపడ్డారు. ఈ ఆఫర్‌ ఫల్‌ సేల్‌ ద్వారా సుమారు మూడు కోట్ల షేర్లను విక్రయించనున్నట్టు తెలుస్తోంది. బీఎస్ఈ లో ప్రస్తుతం 9855 షేర్ హోల్డర్ లు ఉండగా వారిలో 8559 మంది పబ్లిక్ షేర్ హోల్డర్ లు ఉన్నారు వీరందరి దగ్గరా దాదాపు 55 శాతం వాతా ఉండగా మిగితా 1296 మంది ట్రేడింగ్ సభ్యులు వారి అసోసియేట్ లూ ఉన్నారు. మొత్తం 262 మంది వాటాదారులు తమ వాటాలను అమ్మకానికి ఉంచినట్టు తెలుస్తోంది. బీఎస్ఈలో టాప్ 8 వాటాదారులుగా ఉన్న ఎస్జీఎక్స్ సహా వివిధ ఇనిస్టిట్యూషన్స్ 2.99 కోట్ల వాటాలను ఐపీఓలో భాగంగా అమ్మదలిచాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: