ప్రధాని నరేంద్ర మోదీ సూచనల మేరకు బ్యాంకులు వడ్డీ రేట్ల కోత దిశగా చర్యలు ప్రారంభించాయి. దేశంలోనే అతిపెద్ద బ్యాంకు ఎస్బీఐ తన ప్రామాణిక లెండింగ్ రేటును 90 బేసిస్ పాయింట్లు (0.90%) తగ్గిస్తూ ఆదివారం నిర్ణయాన్ని ప్రకటించింది. సదరు బ్యాంకు ప్రకటించిన ఈ ఆఫర్ ప్రకారం.. సగటు ఎంఎల్ఆర్ 8.6 శాతంగా ఉండనుంది. ఒక నెలకు 8.80 శాతం, మూడు నెలలకు 8.90 శాతం, ఆరు మాసాలకు 9.05 శాతం ఈ వడ్డీ రేటు ఉంటుంది. ఇక వార్షిక రేటును 9.20 శాతం , రెండేళ్ల రేటు 9.25 శాతం మూడేళ్ల వడ్డీరేటు 9.30 శాతంగా ఉండనుంది.