ఫార్మా కంపెనీ డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ కి మంచి పేరుంది. అమెరికా కి చెందిన ఫుడ్ అండ్ డ్రగ్ రెగ్యులేటరీ ఇప్పుడు ఆ కంపెనీ కి భారీ షాక్ ఇచ్చింది. వైజాగ్ కి సమీపం లో ఉన్న దువ్వాడ ఫార్ములేషన్ ప్లాంట్ల లో తనిఖీలు నిర్వహించిన అమెరికా సంస్థ 13 అబ్జర్వేషన్లతో కూడిన ఫామ్ 483ని జారీ చేసింది. ఈ విషయాన్ని బాంబే స్టాక్ ఎక్ఛ్సేంజ్ ఫైలింగ్ లో డాక్టర్ రెడ్డీస్ తెలిపింది. దిద్దుబాటు చర్యలను చేపట్టామని ఫైలింగ్ లో పేర్కొంది. ఈ నేపథ్యంలో, డాక్టర్ రెడ్డీస్ షేర్లు మార్కెట్లో భారీ నష్టాలకు గురవుతున్నాయి. దాదాపు 52 వారాల కనిష్టానికి ఈ కంపెనీ షేర్లు పడిపోయాయి.