ఆర్బీఐ తన నిర్ణయాన్ని మార్చుకుంది. మార్చి 25 నుంచి ఏప్రిల్ 1 వరకు శని, ఆదివారాలు, ఇతర సెలువు దినాల్లో కూడా బ్యాంకులు పనిచేయాలని ఆదేశించిన భారతీయ రిజర్వు బ్యాంకు తాజాగా ఏప్రిల్ 1 మూసి వేయాలంటూ ఆదేశించింది. ఆరోజు బ్యాంకులను తెరవడం వల్ల వార్షిక క్లోజర్ సాఫీగా సాగే అవకాశం ఉండదని పేర్కొంది. ఏప్రిల్ 1 నుంచి అనుబంధ బ్యాంకుల విలీనం అమల్లోకి వస్తున్నందున నిర్ణయాన్ని సవరించినట్టు పేర్కొంది.


మరింత సమాచారం తెలుసుకోండి: