భారత దేశంలో గత కొంత కాలంగా కమ్యూనికేషన్ వ్యవస్థలో ఎన్నో మార్పులు చేర్పులు వచ్చాయి. పట్టణ స్థాయి నుంచి గ్రామీణ స్థాయి వరకు సెల్ ఫోన్ వాడకం విపరీతంగా పెరిగిపోయింది. ఈ నేపథ్యంలో కొత్త కొత్త ఫోన్లు మార్కెట్ లోకి వస్తున్నాయి. అంతే కాదు నెట్ వర్క్ లు కూడా యూజర్ చార్జీలు పోటీ పడి మరీ తగ్గిస్తున్నాయి. ఇవన్నీ ఒక ఎత్తైతే గత సంవత్సరం నుంచి జియో చేస్తున్న హడావిడి అంతా ఇంతా కాదు. జియో నెట్ వర్క్ కారణంగా ఇతర నెట్ వర్క్ సంస్థలకు తలనొప్పిగా తయారైంది.
తాజాగా దీపావళి పండుగకు జియో కస్టమర్ల చేతుల్లో మెరిసిన రిలయన్స్ జియో ఫీచర్ ఫోన్ కి సంబంధించి షాకింగ్ న్యూస్ హల్ చల్ చేస్తుంది. జియో ఫోన్ కాశ్మీర్ లో ఛార్జింగ్ పెట్టినప్పుడు కాలిపోయింది . ఈ ఫోన్ ఎందుకు కాలిపోయిందో జియో నుంచి ఇంకా ప్రకటన రాలేదు. జియో ఫోన్ డిస్టిబ్యూటర్స్ దీన్ని పరిశీలించి జియో ఫోన్ బ్యాటరీ మీద ప్రెషర్ వలన కాలిపోయింది అని ప్రకటించారు .
ఫోన్ కాలిపోయిన బ్యాటరీ మాత్రం ఇప్పటికి కూడా బాగానే పని చేస్తుంది అని జియో ( లైఫ్) డిస్ట్రిబ్యూటర్స్ చెప్పారు. ఈ ప్రమాదం తమ దృష్టికి వచ్చిందని, అయితే జియో ఫీచర్ ఫోన్‌ను అంతర్జాతీయ ప్రమాణాలతో రూపొందించినట్టు రిలయన్స్ రీటైల్ ఒక ప్రకటనలో తెలిపింది. దీనిపై తదుపరి పరిశోధనల ఆధారంగా తగిన చర్య తీసుకుంటామని తెలిపింది.ఈ సంఘటన ఉద్దేశపూర్వక ప్రయత్నమని వ్యాఖ్యానించిందని కూడా ఈ నివేదిక పేర్కొంది.