బులియన్ మార్కెట్‌లో ఈరోజు బంగారం ధరలు తగ్గాయి. ఫారిన్ మార్కెట్ ప్రభావం ఇండియన్ మార్కెట్ పై కూడా పడింది. ముఖ్యంగా గత వారం రోజులుగా దేశీయ మార్కెట్‌లో కొనుగోళ్ళ శాతం తగ్గడంతో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం (తులం) ధర అమాంతం తగ్గి ప్రస్తుత రేటు రూ.185 తగ్గి రూ.31,715గా నమోదయింది.
అంతర్జాతీయ పరిస్థితులు, స్థానిక ఆభరణాల తయారీదారుల దగ్గర నుంచి డిమాండ్ లేకపోవడంతో పసిడి ధర తగ్గినట్లు విశ్లేషకులు వివరించారు. స్థానిక ఆభరణాల తయారీదారుల దగ్గర నుంచి డిమాండ్ లేకపోవడంతో పసిడి ధర తగ్గినట్లు విశ్లేషకులు వివరించారు.
అలాగే గ్లోబల్ మార్కెట్‌లో బంగారం ధర 0.11శాతం తగ్గి ఔన్సు 1,273.21 డాలర్లుగా నమోదయింది. కాగా వెండి ధరలో ఎటువంటి మార్పులు చోటు చేసుకోలేదు. కిలో వెండి ధర రూ.41,000గా ఉంది. పారిశ్రామిక వర్గాలు, నాణెల తయారీదారుల నుంచి డిమాండ్ సాధారణంగా ఉంది.