భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్‌ఎన్‌ఎల్) నెట్‌వర్క్‌ను వాడుతున్న వినియోగదారులకు శుభవార్త. రిలయన్స్ జియో పోటీతో ప్రభుత్వరంగ బీఎస్ఎన్ఎల్ కూడా దిగొచ్చింది. కస్టమర్ల ఫ్రెండ్లీ ప్లాన్లను ప్రకటిస్తోంది. ఇదే క్రమంలో అన్ని ప్రీపెయిడ్ అన్ లిమిటెడ్ కాంబో ప్లాన్లపై రోజూ 2జీబీ అదనపు డేటాను ఆఫర్ చేసింది.
రూ.186, రూ.429, రూ.485, రూ.666, రూ.999 ప్లాన్లపై ప్రస్తుతం రెగ్యులర్ గా వస్తున్న డేటాకు అదనంగా ప్రతి రోజూ 2జీబీ డేటాను యూజర్లు వాడుకోవచ్చు. అలాగే, రూ.187, రూ.349, రూ.333, రూ.444, రూ.448 ఎస్టీవీ ప్లాన్లపైనా రోజూ అదనంగా 2జీబీ 3జీ డేటాను పొందొచ్చు.
ప్రతి రోజూ ఈ పరిమితి దాటిన తర్వాత డేటా వేగం 40కేబీపీఎస్ కు తగ్గిపోతుంది. ఈ మధ్య కాలంలో అదనపు డేటాతో బీఎస్ఎన్ఎల్ పలు ఆఫర్లను ప్రకటించింది. ఫిఫా వరల్డ్ కప్ నేపథ్యంలో కేవలం రూ.149కే 4జీబీ డేటాను, 28 రోజుల వ్యాలిడిటీతో ఆఫర్ చేసింది.