ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ ప్రపంచంలోనే అతిపెద్ద క్యాంపస్ హైదరాబాద్‌లో కొలువుదీరింది. నానక్ రామ్ గూడలో 10 ఎకరాల్లో క్యాంపస్ నిర్మాణం జరిగింది. మొత్తం 15 అంతస్తులతో.. మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణంలో రూపొందింది.
ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్.. హైదరాబాద్ కు చాలా ప్రాధాన్యత ఇస్తోంది. ప్రపంచంలోనే అతి పెద్ద క్యాంపస్ భవనానికి హైదరాబాద్ వేదికైంది. నానక్‌రాంగూడలోని ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో 10 ఎకరాల స్థలంలో అత్యాధునిక మౌలికవసతులతో దీనిని నిర్మితమైంది. 15 అంతస్తుల భవనంలో 10లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంతో పార్కింగ్ ప్రదేశం, మరో 20 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉద్యోగులు పనిచేసే కార్యాలయ ప్రాంగణాన్ని నిర్మించారు.
ఇటీవలే అమెజాన్ క్యాంపస్ నిర్మాణం పూర్తయింది. దాదాపు ఏడువేల మంది ఉద్యోగులు అందులో నుంచే విధులు నిర్వహిస్తున్నా, అధికారికంగా దాన్ని ప్రారంభించలేదు. సెప్టెంబరు చివరి నాటికి ఉద్యోగుల సంఖ్య 9వేలకు పెరుగుతుందనీ, భవిష్యత్తులో మరింత పెరగొచ్చనీ అంటున్నారు. కొత్తగా నిర్మించిన భవనంలో ఒకేసారి 26 వేల నుంచి 30 వేల మంది పనిచేసేలా మౌలిక వసతులను కల్పించాలని భావిస్తున్నట్టు సమాచారం. దేశంలోనే అతిపెద్ద గోదామును రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయ సమీపంలో ఇప్పటికే అమెజాన్ ఏర్పాటు చేసింది. ఇది నాలుగు లక్షల చదరపు అడుగులకు పైగా విస్తీర్ణంలో ఉంది. 2020 మధ్యకాలం నాటికి దీన్ని 5.8 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంకు పెంచుకోవాలన్న యోచనలో ఉంది.