డబ్బులు ఊరికే రావు అంటూ టీవీ ప్రకటనల్లో నిత్యం కనిపించే
కిరణ్ కుమార్ అందరికీ సుపరిచితుడే. రెండు తెలుగు రాష్ట్రాల్లో లలితా జ్యువెలరీ బిజినెస్ ఓ రేంజ్ లో సాగిపోతోంది. అదే సమయంలో జ్యువెలరీలో వరుసగా దొంగతనాలు జరుగుతుండటం కలకలం రేపుతోంది. నిన్న తిరుచ్చిలో జరిగిన దొంగతనం కేసులో నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఈ మధ్య కాలంలో లలితా జ్యువెలరీ షాపులలో నిత్యం దొంగతనాలు జరుగుతున్నాయి. కోట్ల కొద్దీ విలువ చేసే బంగారు...వజ్రాలు చోరీకి గురవుతున్నాయి. దీనిపై
కిరణ్ కుమార్ యాడ్స్ ను బేస్ చేసుకొని నగలు ఊరికేపోవు అంటూ ఆయనకే కౌంటర్ ఇస్తున్నారు. గత బుధవారం జరిగిన దొంగతనం కేసులో నిందితులను పోలీసులు పట్టుకున్నారు.
తిరుచ్చిలోని లలితా జ్యూవెలరీ షాపులో దొంగతనానికి పాల్పడిన ఐదుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పుదుకొట్టై హోటల్‌లో వీరిని కస్టడీలోకి తీసుకున్నారు. పోలీసులు రావడంతో లాడ్జిపై నుంచి దూకి పారిపోయేందుకు ప్రయత్నించిన ఓ దొంగ తీవ్రంగా గాయపడ్డాడు. ఈ కేసులో మహారాష్ట్ర, కేరళకు చెందిన దొంగల ముఠాను అరెస్ట్ చేశారు. వీరంతా వివిధ రాష్ట్రాల్లో దుప్పట్ల వ్యాపారం చేసుకునే వారిగా పోలీసులు గుర్తించారు. చోరీకి గురైన బంగారాన్ని, వజ్రాభరణాలను ఎక్కడ దాచారో అన్న దానిపై విచారణ సాగుతోంది. లలితా జ్యువెలరీలో వరుస దొంగతనాలు జరుగుతుండటంతో మరిన్ని రక్షణ చర్యలు తీసుకునే దిశగా కిరణ్
కుమార్ అడుగులు వేస్తున్నారు.