వృద్ధాప్యంలో ఆసరా కోసం
కేంద్ర ప్రభుత్వానికి చెందిన పెన్షన్ పథకాలు చాలా ఉన్నాయి. అలాంటి పథకాల్లో అటల్ పెన్షన్ పథకం కూడా ఒకటి. ఈ స్కీమ్‌తో లాభాలేంటో ఇప్పుడు తెలుసుకుందామా మరి...
రిటైర్మెంట్ తర్వాత నెలనెలా పెన్షన్ కోరుకునేవారికి అటల్ పెన్షన్ యోజన...ఒక మంచి ఆప్షన్ అనే చెప్పాలి. ఈ స్కీమ్‌లో చేరాలంటే వయస్సు పరిమితి 18 నుంచి 40 ఏళ్ల మధ్య కచ్చితంగా ఉండాలి. ప్రతీ ఒక్కరికి బ్యాంకులో లేదా పోస్ట్ ఆఫీస్‌లో సేవింగ్స్ అకౌంట్ కలిగి ఉండాలి. ఈ స్కీమ్‌లో చేరినవారికి ఆదాయపు పన్ను చట్టంలోని 80 సీసీడీ (1) కింద పన్ను మినహాయింపులు కూడా లభించడం జరుగుతుంది.
మీ కంట్రిబ్యూషన్‌ను బట్టి నెలకు రూ.1,000 నుంచి రూ.5,000 వరకు పెన్షన్ డబ్బులు పొందే అవకాశం ఉంది. పథకాన్ని మధ్యలో నిలిపేసినవాళ్లు పెనాల్టీ చెల్లించి రెన్యువల్ చేసుకొనే అవకాశం కూడా ఉంది. ఇక ఉదాహరణకు ఓ వ్యక్తి 18 ఏళ్ల వయస్సులో అటల్ పెన్షన్ యోజనలో చేరితే 60 ఏళ్ల తర్వాత నెలకు రూ.1,000 పెన్షన్ పొందేందుకు నెలకు రూ.42 జమ చేయాల్సి ఉంటుంది. అదే రూ.5,000 పెన్షన్ పొందాలంటే రూ.210 జమ చేయాలి. ఈ స్కీమ్‌లో చేరడానికి గరిష్ట వయస్సు 40 ఏళ్లు ఉండాలి.
ఈ స్కీమ్‌లో చేరినవాళ్లు 60 ఏళ్ల లోపు చనిపోతే
జీవిత భాగస్వామి అటల్ పెన్షన్ యోజన అకౌంట్‌ను కూడా ముందుకు కొనసాగించవచ్చు. ఒకవేళ భార్యాభర్తలు ఇద్దరూ చనిపోతే నామినీకి పెన్షన్ కార్పస్ కూడా పొందవచ్చు. ఈ విధంగా యుక్త వయసులోనే ఈ పెన్షన్ లో చేరితే వృద్ధాప్యంలో మరింత ఆసరాగా ఉంటుంది అనే భావనతో ఈ పథకం అమలు చేయడం జరిగింది. పౌరులకు కనీస పెన్షన్ ఇవ్వాలన్న ఉద్దేశ్యంతో కేంద్రం అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ పథకాన్ని ప్రారంభించడం జరిగింది. మరెందుకు ఆలస్యం....వెంటనే ఈ స్కీంలో చేరి మరిన్ని ప్రయోజనాలను మీ సొంతం చేయేసుకోండి.