మనకి డబ్బులతో ఎప్పుడైనా అవసరం ఉండవచ్చు. ఏ అవసరం ఎప్పుడు వస్తుందో ఎవరు ఏమి చెప్పలేం కదా. కొన్ని సందర్భాల్లో అనుకోకుండా డబ్బు అవసరం పడుతుంది. అలాంటప్పుడు బ్యాంక్ అకౌంట్‌లో క్యాష్ ఉంటే పర్లేదు. లేకపోతే? అప్పుడు చాలా మంది పర్సనల్ లోన్ వైపు ఇష్టం చూపిస్తారు. లోన్ తీసుకునేందుకు బ్యాంకులకు వెళ్లడం మొదలు పెడతారు.
మీకు డబ్బులు అవసరం పడితే గోల్డ్, ప్రాపర్టీ వంటి వాటిపై రుణం తీసుకోండి. కానీ పర్సనల్ లోన్ మాత్రం ఎప్పటికి తీసుకోవద్దు. ఎందుకు వద్దో తెలుసు కుందామా మరి...వాస్తవానికి పర్సనల్ లోన్స్‌పై వడ్డీ రేట్లు ఎక్కువగా ఉంటుంది. క్రెడిట్ కార్డుల తర్వాత ఈ తరహా రుణాలపైనే మార్కెట్‌లో వడ్డీ రేట్లు ఎక్కువగా లభిస్తాయి. కొన్ని సందర్భాల్లో ఏకంగా 24 శాతం వరకు వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. గోల్డ్ లోన్, ప్రాపర్టీ లోన్, ఆటో లోన్ వంటి రుణాలపై వడ్డీ రేటు తక్కువగా లభిస్తుంది. అందుకే పర్సనల్ లోన్‌కు దూరంగా ఉండటం చాల మంచిది.
ఒకవేళ పర్సనల్ లోన్ తీసుకుంటే ప్రిపేమెంట్ చార్జీలు కూడా వర్తిస్తాయి. ఇతర రుణాలపై ఎటువంటి ప్రిపేమెంట్ చార్జీలు మనకి ఉండవు. బంగారంపై రుణం విషయానికి వస్తే ఎలాంటి ప్రిపేమెంట్ చార్జీలు ఉండవు. క్రెడిట్ స్కోర్ బాగులేకపోతే మీకు పర్సనల్ లోన్ రాదు. బ్యాంకులు మీ అప్లికేషన్‌ను రిజెక్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది. పర్సనల్ లోన్స్‌పై ప్రాసెసింగ్ ఫీజు కూడా చాల ఎక్కువగా ఉంటుంది. ఇతర రుణాలతో పోలిస్తే ఇది ఎక్కువగా ఉండటం చాల గమనార్హం. బంగారంపై రుణంతో పోలిస్తే పర్సనల్ లోన్‌పై ప్రాసెసింగ్ ఫీజు ఎక్కువగా చెల్లించాల్సి వస్తుంది.
ఇవి కాకుండా పర్సనల్ లోన్ తీసుకోవడానికి చాలా టైమ్ పడుతుంది. అందుకే ఇతర ఆప్షన్ల వైపు చూడటం చాల మంచిది. గోల్డ్ లోన్ అయితే వెంటనే మనకి వస్తుంది. ఏదేమైనా పర్సనల్ లోన్ తీసుకోవాలని ప్లాన్ చేస్తే ఏ ఏ బ్యాంక్‌లో ఎంత వడ్డీ రేటు ఉందో కూడా ఇంకో సరి పూర్తి వివరాలు తెలుసుకోండి.